Jan 25,2022 21:41

వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హరిప్రసాద్‌తో ఆరాతీస్తున్న సిపిఎం బృందం

             గుంతకల్లు : వంద పడకల సామర్థ్యం ఉన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులను సిపిఎం పట్టణ కమిటీ బందం పరిశీలించింది. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌ను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ విషయమై గతంలో అనేకసార్లు ఉన్నత వైద్యశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు అందిచడంలో, డాక్టర్లను నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆసుపత్రిలో 18 మంది వైద్యులు ఉండాల్సిన ఉన్నచోట ఏడుగురు, 21 మంది నర్సులు ఉండాల్సిన చోట 11 మంది మాత్రమే ఉన్నారన్నారు. ప్రధానంగా ఆసుపత్రిలో ఉండాల్సిన వంటి అనస్థీషియన్‌ (మత్తు డాక్టర్‌) లేకపోవడం వల్ల ఆపరేషన్లు జరగక గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. 10 ఐసియు బెడ్స్‌ ఉంటే వాటిని ఇంతవరకు ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉంచడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కావున జిల్లా అధికారులు వెంటనే టెక్నీషియన్స్‌ను నియమించి ఐసియు బెడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించే నర్సులు కేవలం ముగ్గురిని మాత్రమే నియమించి చేతులు కడుక్కునే పరిస్థితి కనపడుతోందని, వారు కూడా ఫిబ్రవరి నాలుగో తేదీన ఒప్పందం రద్దు అవుతుందన్నారు. కావున కరోనా ఉధతిని దష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు చొరవ చూపి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, జగ్గలి రమేష్‌, కసాపురం రమేష్‌, వైటిసి రమేష్‌, రామునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.