Jan 31,2023 21:13

ప్రజాశక్తి - కాళ్ల
పల్లెపాలెం చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామస్తులకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.7 కోట్ల లబ్ధి చేకూరిందని డిసిసిబి ఛైైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. పల్లెపాలెంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్‌ నరసింహరాజు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా ఫ్యాన్‌ గుర్తుకే ఓటేసి వైసిపిని గెలిపించాలన్నారు. గ్రామంలో సిమెంట్‌ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు బాడ్డు రామకృష్ణ, మండల అధ్యక్షులు గణేశ్న రాంబాబు, కలవపూడి సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స ప్రసాదరాజు, వేగేశ్న బాల గణపతివర్మ, సాగిరాజు హరివర్మ, నాయకులు పాల్గొన్నారు.