
ప్రకాశం (గిద్దలూరు రూరల్) : కేంద్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు. సీఐటీయూ పచ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి టి.ఆవులయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీల జేబులు నింపుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం కేంద్ర కీలకమైన ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను పెట్టుబడుదారులకు అమ్మేస్తూ మోడీ ప్రభుత్వం దేశభక్తి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్నా అంగన్వాడి, మద్యహ్న భోజనం, ఆశ, స్వఛ్ఛబారత్, ఐకెపి స్కీం వర్కర్స్కు కనీస చట్టాలు అమలు చేయకుండా వారి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆశా వర్కర్లు రాజమణి, చెన్నమ్మ, వీఓఏ బీబీ, మెప్మా ఆర్పిలు పద్మావతి, రాధాదేవి, పారిశుధ్య కార్మికులు నాగయ్య, మురళి, ఆటో కార్మికులు శేషు, మస్తాన్, ఉస్మాన్, ముఠా కార్మికులు తిరుమలరావు, భవన నిర్మాణ కార్మికులు థామస్, నరసింహులు పాల్గొన్నారు.