Nov 30,2022 21:47

సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలను ప్రతి ఇంటికెళ్లి తెలియజేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నందు టిడిపి తలపెట్టిన ఇదేం కర్మ కార్యక్రమం అమలుపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అరాచకాలకు అంతులేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వాలెంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.