Aug 06,2022 23:35

బాలల లైంగిక వేధింపులను ఆపాలని పోస్టర్‌ను ఆవిష్కరించిన నంద్యాల కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌

బాలల లైంగిక వేధింపులను అరికట్టండి
పోస్టర్‌ను ఆవిష్కరించిన నంద్యాల కలెక్టర్‌
             ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ :
ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత సంక్షేమ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామున్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉన్న వసతి గఅహాల్లో వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపల్‌ అధికారులను ఆదేశించామన్నారు.
              అనంతరం జిల్లా కలెక్టర్‌ బాలల లైంగిక వేధింపులను అరికట్టండి అనే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చింతామణి, బిసి వెల్ఫేర్‌ అధికారి లక్ష్మీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి హుస్సేనయ్య, ఎఎస్‌డబ్ల్యు, ఎబిసిడబ్ల్యుఎటిడబు, ఎటిడబ్ల్యు అధికారులు తదితరులు పాల్గన్నారు.