Jul 28,2021 20:34


ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ నిర్వహిస్తున్న యువీకాన్‌ ఫౌండేషన్‌ తన మిషన్‌1000బెడ్స్‌ లక్ష్యంలో భాగంగా నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌లో 120 క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సిసియు) పడకలను ఏర్పాటు చేసింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ యాక్సెంచర్‌ అందించిన ఆర్థిక సహాయంతో ఐసియు వెంటిలేటర్లు, రోగి మానిటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు వంటి వివిధ వైద్య పరికరాలను కూడా అందించింది. ''కోవిడ్‌ -19 యొక్క రెండవ వేవ్‌లో మనమందరం ఎంతో బాధపడ్డాము. ఈ భయంకరమైన వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో మన ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలని భావించాను. మిషన్‌ 1000 బెడ్స్‌ లక్ష్యం ద్వారా, దేశవ్యాప్తంగా హాస్పిటల్‌లలో ప్రస్తుత సామర్థ్యాలను పెంచడానికి కోవిడ్‌ -19 కి)టికల్‌ కేర్‌ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము''. అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.