Dec 07,2022 22:32

ప్రజాశక్తి-కంచికచర్ల
నేటి సమాజంలో పసిపిల్లల నుండి పండు ముసలి వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతు న్నాయని కంచికచర్ల మండలం శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ భార్గవి పేర్కొన్నారు. బుధవారం కంచికచర్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన మహిళల స్నేహపూర్వక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని బాలికలు తన తోటి మగవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి నడవడిక ప్రవర్తనను గమనించి తల్లిదండ్రులకు తెలియ జేయాలని సూచిం చారు. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బాలికలు అన్నింట లింగ వివక్షతకు గురవుతున్నారని నేటి సమాజంలో పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బాలికలు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోవడానికి నిర్విరామంగా కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్‌ తారాబి, కరీమా,అంగన్వాడీ కార్యకర్తలు వాణి,మహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు ఏపీఎం పాల్గొన్నారు