Jul 29,2021 22:56

మాట్లాడుతున్న అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌ఒ

అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌ఒ
ప్రజాశక్తి - శిరివెళ్ల: 
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ, జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి దేవ సాగర్‌ తెలిపారు. శిరివెళ్ల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గురువారం కుష్టు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గడప గడపకు వెళ్లి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిఆ యన ఆకస్మిక తనిఖీ చేశారు. శిరివెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి విజరు కుమార్‌ ఆధ్వర్యంలో పలువురికి అనుమానిత పరీక్షలు నిర్వహించారు. జిల్లా లెప్రసి అధికారి డాక్టర్‌ విజరు కుమార్‌, డిపిఎం ప్రసాద్‌, లెప్రసీ నోడల్‌ ఆఫీసర్‌ మధుసూదన్‌, ఏఎన్‌ఎంలు సిహెచ్‌ఒలు, ఆశా వర్కర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.