Oct 03,2022 23:25

మురుగు కాలువను పరిశీలిస్తున్న ఎంపిపి

ప్రజాశక్తి-చీమకుర్తి  :  విషజ్వరాలు వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిధిలోని పాటిమీదపాలెం అంబేద్కర్‌నగర్‌ను ఎంపిటిసి కూడల అంజలి మాలకొండయ్య, సర్పంచి బి. కరుణప్రియనానితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి పైపులైన్‌ మరమ్మతుల దృష్ట్యా తాగునీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. స్పందించిన ఎంపిపి శ్రీనివాసరావు ఇంజినీర్‌తో మాట్లాడి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అనంతరం పాఠశాల ముందు మురుగు కాలువను పరిశీలించి కాలువలోని పూడికను తీయించారు.ఈ కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు కూడల మాలకొండయ్య, బి. నాని,గ్రామ నాయకులు పాల్గొన్నారు.