
ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతీ వాసులు పరిశుభ్రత పాటించాలని చైర్‌పర్సన్ బంగారు సరోజిని కోరారు. గురువారం ఆమె పలు వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత, మంచినీటి సరఫరా, పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా 4వ వార్డు పరిధిలో తెలుకల వీధి, రెల్లి వీధి, టీచర్స్ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పారిశుధ్యం, తాగు నీరు సరఫరా, విద్యుత్ సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో జాప్యం జరిగితే తనను సంప్రదించాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వార్డులో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బంగారు శంకర రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు, సచివాలయం, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.