Sep 15,2021 21:19

కంచికచర్ల : మండలంలోని పరిటాల గ్రామంలో పోషకాహార మహోత్సవంలో భాగంగా బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కంచికచర్ల ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ వి.వెంకట్రావమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిడిపిఓ వి భాగ్యరేణుక పాల్గొని పోషకాహారంపై అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పోషకాహార ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి యద్దనపూడి ఆనంద జ్యోత్స్న, ఏయంసి ఛైర్మన్‌ మార్త రజిని శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు చింతా రవి తదితరులు పాల్గొన్నారు.