Jan 17,2022 22:21

మాట్లాడుతున్న తోట మద్దులు

ప్రజాశక్తి - నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా నాయకులు తోట మద్దులు విమర్శించారు. సోమవారం నంద్యాలలోని టి నరసింహ భవనంలో సిపిఎం పట్టణ కమిటీ జనరల్‌ బాడీ సమావేశం పట్టణ సెక్రటేరియట్‌ సభ్యులు కెఎండి గౌస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి నరసింహ, పట్టణ సెక్రటేరియట్‌ సభ్యులు దర్శనం లక్ష్మణ్‌, వెంకట్‌ లింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలపైనే భారాలు మోపుతూ దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తుం దని విమర్శించారు. రోజురోజుకు ధరలను పెంచుతూ పోతుందని, ప్రవేట్‌ వ్యాపారస్తులకు కొమ్ముకాస్తు ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తుందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతోం దని, బిజెపి చేసే పాలనకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో ఈ మూడేళ్ల పాలనలో శూన్యంగా ఉందని, పథకాలకే పరిమితం అయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇదే పాలన కొనసాగిస్తే వైసిపికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు భాస్కరాచారి, జైలాన్‌, వీరసేన, శివ, లక్ష్మణ్‌, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.