Jul 29,2021 22:26

కరపత్రాలు విడుదల చేస్తున్న రైతుసంఘం నాయకులు

      తనకల్లు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఆగస్టు 9న జరిగే దేశవ్యాప్త సమ్మె ద్వారా సంఘటితంగా తిప్పికొడదామని రైతుసంఘం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సమ్మెకు సంబంధిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలను ఆపాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విరివిగా కల్పించాలన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రజలు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు వివి.రమణ, శివన్న, కొట్టు వెంకటరమణ, ఒంటెద్దు వేమన్న, డిఎస్‌ఎస్‌ చిన్నప్ప పాల్గొన్నారు.