Aug 07,2022 22:28

ఫొటో : విరాళం అందజేస్తున్న దృశ్యం

ఫొటో : విరాళం అందజేస్తున్న దృశ్యం
ప్రజానేత చేజర్లకు ఆశీస్సులు
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రజల నేత అనునిత్యం ప్రజలను ఆదుకునే జననేత మాజీ ఎంపిపి చేజర్ల సుబ్బారెడ్డికి ముస్లిముల దేవుని ఆశీస్సులు ఉంటాయని స్థానిక ముస్లిం పెద్దలు సోదరులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సినిమాహాల్‌ సెంటర్‌లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన పీర్ల చావిడిలో పీర్లను దర్శించారు. అనంతరం ముస్లింల పెద్దలు సోదరుల కోరిక మేరకు చేజర్ల సుబ్బారెడ్డి అన్నదాన కార్యక్రమానికి రూ.20 వేలు అందజేశారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరివాడు ప్రజలు కోరుకునే చేజర్ల సుబ్బారెడ్డి లాంటి నాయకులు నియోజకవర్గంలోని ప్రజలకి ఎంతో అవసరమని వారికి ముస్లిముల దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకుడు రాజారెడ్డి, ఉప్పుటూరి శ్రీనివాసులు, రియాజ్‌ స్థానిక ముస్లిం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.