Jul 29,2021 22:54

 గ్రామంలో తిరుగుతున్న అధికారులు

త్వరలోనే సమస్యకు పరిష్కారాలు కనుక్కొంటాం
ప్రజాశక్తి - కొత్తపల్లి: 
ప్రజాశక్తి దినపత్రికలో గురువారం ప్రచురితమైన 'పల్లెకు జ్వరమొచ్చింది' కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మండలంలోని పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అధికారుల బృందం పర్యటించి విష జ్వరాలను ఆరా తీశారు. ఇఒఆర్‌డి శ్రీనివాస నాయుడు, గ్రామ సర్పంచి విజరు కుమార్‌, వైద్యులు శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ సుహాచల తదితరులు ముందుగా గ్రామంలోని అన్ని కాలనీలు తిరుగుతూ విష జ్వరాల బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పలువురికి మలేరియా పరీక్షలు చేశామని, మంచినీటిని ల్యాబ్‌కు పంపించేందుకు శాంపిల్స్‌ తీసుకున్నామనిచ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సలాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.