Nov 26,2021 10:56

ప్రజాశక్తి-నందిగామ (కృష్ణా) : ప్రజాశక్తి ప్రచురించిన రైతు ఉద్యమం ప్రత్యేక సంచికను శుక్రవారం ఉదయం నందిగామ గాంధీ సెంటర్‌ లో ఎపి రైతు సంఘం నాయకులు ఆవిష్కరించారు. రైతు సంఘం జిల్లా నాయకులు చనుమోలు సైదులు మాట్లాడుతూ... రైతు ఉద్యమ పోరాటం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా... ప్రజాశక్తి రైతు ఉద్యమం ప్రత్యేక సంచికను ప్రచురించటం అభినందనీయమని ప్రశంసించారు. రైతన్న కు జేజేలు పలికారు. రైతు పోరాటంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని 750 మంది రైతులు ఆమరులయ్యారని స్మరించుకున్నారు. రైతుల వీరోచిత పోరాటం ముందు మోడీ ప్రభుత్వం పాక్షికంగానైనా తలవంచక తప్పలేదన్నారు. కనీస మద్దతు ధర చట్టం చేయకపోవడంతోపాటు, రైతు సంఘాలు లేవనెత్తిన అన్ని డిమాండ్లను పరిష్కరించేంతవరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు, రైతు నాయకులు గోపాల్‌ కటారపు, సయ్యద్‌ ఖాసిం, పిచ్చేశ్వరరావు, గోపినాయక్‌, జక్కలూరి రవి, కరి వెంకటేశ్వరరావు, లాజరు, యర్రా శ్రీనివాసరావు, పాలేటి పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.