Jul 29,2021 23:42

సి.నారాయణరెడ్డి విగ్రహం వద్ద అక్కరమాని, చెన్నా తదితరులు

సిరిపురం : తెలుగు ప్రజల గుండెల్లో సినీ గేయ రచయిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహిత్యం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల అన్నారు. సి.నారాయణరెడ్డి 90వ జయంతి సందర్భంగా గురువారం ఆర్కే బీచ్‌ రోడ్డులో ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, ఆత్రేయ స్మారక కళా పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొనానరు. సి.నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో సినిమా పాటలు, గజల్స్‌, కవితలు, కావ్యాలు రచించిన గొప్ప సాహితీ వేత్త సినారె అని కొనియాడారు. ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞాన పీఠ అవార్డు దక్కించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నా తిరుమలరావు, గంటి మురళీధర్‌, చెక్కా రమాదేవి పాల్గొన్నారు.