Jul 29,2021 20:23

నర్సింహనగర్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల

విజయనగరంటౌన్‌ : ప్రజల కోసం మరిన్నిసేవా కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. గురువారం తోటపాలెంలో 32వ డివిజన్‌ నర్సింహ నగర్‌లో జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు డివిజన్‌ అధ్యక్షులు భోగాపురపు రవిచంద్ర, కార్పొరేటర్‌ భోగాపురపు లక్ష్మి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమారు వంద మొక్కలను ఎమ్మెల్యేతో పాటు మేయర్‌ విజయలక్ష్మి నాటారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి, కార్పొరేటర్‌ కోలగట్ల శ్రావణి, నాయకులు ఎం.బాలబ్రహ్మారెడ్డి, స్థానిక నాయకులు వి.కృష్ణారావు, కరణం రమేష్‌, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
సాయంత్రం జోనల్‌ ఇన్‌ఛార్జిలు, రెడ్‌క్రాస్‌,రోటరీ, జిల్లా కేంద్ర రక్తనిధి ప్రతినిధులతో కలిసి విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆపద సమయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, రోగుల ప్రాణాలు కాపాడడం లో సహకరించిన ఎమ్మెల్యే కోలగట్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. 1680 యూనిట్ల రక్తాన్ని సేకరించడం అరుదైన విషయమన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కెఆర్‌డి ప్రసాద్‌ రావు పాల్గొన్నారు.