Jul 22,2021 06:47

పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఈ ఏడాది మూడు లక్షల ముప్పై అయిదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులు, లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన వ్యాపారస్తులు, కరోనా మూలంగా మూతబడిన పరిశ్రమల కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిరుద్యోగులుగా మారి పూటతిండికే అల్లల్లాడుతున్నారు. ఓరకంగా చెప్పాలంటే ఎలుకకు ప్రాణ పోకడ, పిల్లికి చెలగాటంలా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి. ప్రజలు ఎలా చస్తే మనకేంటి? ఖజానా నింపుకోవడమే ఏకైక మార్గంగా పాలకుల దుర్నీతి అవగతమౌతోంది. టూకీగా చెప్పాలంటే ''ప్రజలకు మంటలు ప్రభుత్వాలకు పంటలు'' ప్రజల గోడు పట్టని పాలకుల వికృత క్రీనీడలో విజయోస్తు భారతమాత విజయోస్తు!!
- యర్రమోతు ధర్మరాజు,
ధవళేశ్వరం.