Nov 29,2021 23:27

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ నరసింహారావు

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ నరసింహారావు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాతో పాటు మండలంలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీనికితోడు పైన జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాల నుంచి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో నరసింహారావు సూచించారు.
అంతేకాకుండా వరద ముంపు గ్రామాలైన జొన్నవాడ, పెనుబల్లి, కాగులపాడు, దామరమడుగు, నెహ్రూనగర్‌కాలనీలలో ఇప్పటికే దండోరా వేయించడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపిడిఒ నరసింహారావు సోమవారం ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా రైతులు రాత్రి వేళలో పొలాలకు వెళ్లవద్దని కోరారు.