Sep 15,2021 23:56

మాట్లాడుతున్న సిఐ శ్రీరామ్‌

ప్రజాశక్తి-కందుకూరు : కాలేజీ మేగజైన్‌ (జర్నల్‌) లో అధ్యాప కులను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సిఐ వి. శ్రీరామ్‌ సూచించారు. ఇంజినీర్స్‌ డే సందర్భంగా ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాలలో రూపొందించిన 'ప్రకాశం పల్స్‌' మేగజైన్‌ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తే రాత నైపుణ్యాలు పెంపొందు తాయని చెప్పారు. అధ్యాపకులకు కూడా అన్ని విభాగాల సమాచారం ఒకరికొకరు తెలుసుకునే అవకాశం ఉంటుం దన్నారు. విద్య - ఉపాధి - క్రమశిక్షణలో తమ కళాశాల అగ్రభాగాన తీర్చిదిద్దుతున్నామని అధ్యక్షోప న్యాసంలో కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది తమ విద్యార్థులు సాధించిన మల్టీ నేషనల్‌ కంపెనీల ఉద్యోగాలను ఉదహరిస్తూ, ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులను మరింతగా రాణించేలా తీర్చిదిద్దేం దుకు తమతో పాటు అధ్యాపకులు కూడా కషి చేయాలన్నారు. కంచర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌, కాలేజీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ కేసుల పరిశోధనలలో ఆధునిక టెక్నాలజీ ద్వారా సిఐ శ్రీరామ్‌ సాధిస్తున్న విజయాలను ప్రశంసించారు. ప్రకాశం పల్స్‌ను రూపొందించిన కంప్యూటర్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టీ.కష్ణ కిషోర్‌ను ఈ సందర్భంగా శ్రీకాంత్‌ అభినందించారు.