Oct 12,2021 11:45

చందమామ చూపిస్తూ
గోరుముద్ద తినిపిస్తా

పండువెన్నెలలోన
చల్లని కథలను చెపుతా

పిల్లగాలి దారులలో
షికారుకు తిప్పుతా

పచ్చనైన పంటపొలం
గట్టుపైన నడిపిస్తా

సెలయేటి నీటిలోన
స్నానాలు చేయిస్తా

కొండపైకి తీసుకెళ్లి
పచ్చని చెట్లు తిప్పి చూపిస్తా

మర్రిచెట్టు ఊడలతో
ఊయలను ఊగిస్తా

ఆకు చివర తుషారాన్ని
చూపి నిన్ను మురిపిస్తా

- రావిపల్లి వాసుదేవరావు
94417 13136