Feb 06,2023 23:40

ర్యాలీ చేపడుతున్న పాఠశాల సిబ్బంది , విద్యార్థులు

ప్రజాశక్తి -కొత్తకోట:ప్రకతి వ్యవసాయంతో ఆరోగ్య కరమైన ఆహారం లభిస్తోందని ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకోవాలని మండల వ్యవసాయశాఖ ఎంటి రామలక్ష్మి సూచించారు. రావికమతం మండలం కొత్తకోటలో సోమవారం ప్రపంచం చూపు ప్రకృతి వ్యవసాయం వైపు' అనే నినాదంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల తో భారీ ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. అనంతరం పలువురు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, వరి పంటకు ముందు ఖాళీ భూముల్లో 9 రకాల విత్తనాలు చల్లు కోవాలని, తడి మడులను దమ్ము పట్టు కోవాలన్నారు. దీంతో పంటకు కావాల్సిన పోషకాలు అందడంతో పాటు పెట్టు బడి తగ్గుతోందని పేర్కొన్నారు. అంతక ముందు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం డి.సత్యారావు, గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ కోన లోవరాజు, పి.దేవ, పాఠశాల కమిటి చైర్మన్‌ అడ్డురి నానాజీ, గ్రామ వ్యవసాయధికారి శ్రీను, సుధారాణి పలువురు గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.