Nov 25,2021 12:34

బెంగళూరు : ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ హరిణి కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అయితే అనూహ్యంగా ఆమె తండ్రి ఎకె రావు అనుమానాస్పద స్థితిలో మఅతి చెందారు. బెంగళూరులోని ఓ రైల్వేట్రాక్‌పై ఆయన  మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో నివహిస్తున్న హరిణి కుటుంబ సభ్యులు గతవారం రోజుల నుంచి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎకెరావు  మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో హరిణి ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహా, కృష్ణబాబు, రావోయి చందమామ, అన్నయ్య, లెజెండ్‌, ఎవడే సుబ్రమణ్యం, స్పైడర్‌, నిశ్శబ్దం వంటి అనేక చిత్రాల్లో పాటలు పాడారు.