Jun 11,2021 21:34

ప్రశంసా పత్రాలు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారధి

ప్రజాశక్తి-పెనుకొండ : కరోనా సమయంలో ప్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేసిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలు అబినందనీయమని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి పేర్కొన్నారు. ప్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పంపిన ప్రశంసాపత్రాలను పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి మాజీ ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు . అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు టిడిపి నాయకులు శశిభూషణ్‌ , టిడిపి నాయకులతో కలిసి స్థానిక సిఐ కార్యాలయంలో సిఐ వెంకటేశ్వర్లుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అలాగే డీఎస్పీ మహబూబాబాషా, ఎస్‌ఐ రమేష్‌ బాబుకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు .ఈ కార్యక్రమంలో పెనుకొండ టిడిపి మండల కన్వీనర్‌ శ్రీరాములు, టౌన్‌ కన్వీనర్‌ హుజూర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జీపీ నాయుడు, చిన్న వెంకటరాముడు, సర్పంచి శ్రీనివాసులు, సూర్యనారాయణ, సుబ్రమణ్యం, సిద్దయ్య, త్రివేంద్ర, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.