Apr 07,2021 21:41

దుబాయ్‌ : 2021 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ప్రస్తుతం భారత్‌లో రోజుకు ఒక లక్షకు పైగా కొత్త కోవిడ్‌ా19 కేసులు నమోదవుతున్నాయి. మెగా ఈవెంట్‌కు నిర్వహణకు మరో ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకుంటే ప్రత్యామ్నాయ వేదికను సైతం సిద్ధంగానే ఉంచుతున్నామని ఐసీసీ సీఈవో తెలిపారు. ' అవును, ఐసీసీ వద్ద బ్యాకప్‌ ప్లాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారం టోర్నీ సాగుతుందని ఆశిస్తున్నాం. పరిస్థితుల్లో మార్పు లేకుంటే సరైన సమయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేస్తాం' అని తెలిపాడు.