Oct 27,2021 15:17

ఆహారంలో భాగంగా చేపల్ని తీసుకుంటే.. ఆరోగ్యానికెంతో మంచిదని వైద్యులు సూచిస్తారు. చేపల ఆహారం అనేక రోగాల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. అందుకే డాక్టర్లు చేపల్ని ఆహారంలో భాగం చేసుకోమని చెబుతారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే చేపల్లో.. కొన్ని ప్రత్యేకమైన చేపలు ఎక్కువ ఖరీదు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలుగా టూనా చేపలను చెబుతారు. అయితే టూనా చేపట్లో కూడా బ్లూఫిన్‌ టూనా చేప రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ రకం చేపలకు రేటు ఎక్కువగా ఉండడానికి కారణం.. ఇవి అంతరించిపోయే జాతి చేపలుగా గుర్తించడం వల్ల వీటి ధర ఎక్కువగా ఉంటుందట. ఈ చేపల వేటకు కొన్ని దేశాల్లో మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల జపాన్‌లో 278 కిలోల బరువైన బ్లూఫిన్‌ టూనా చేప దొరికితే.. దాన్ని 2.5 మిలియన్‌ పౌండ్లకు వేలంలో అమ్మేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు 25 కోట్ల రూపాయల పైమాటే. బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ చేపల వేట నిషేధం కావడంతో ఒకవేళ ఎవరకైనా ఈ చేప చిక్కినా దానిని సముద్రంలో వదిలేస్తుంటారు.