
ఇంటర్నెట్‌డెస్క్ : ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో ఎన్టీఆర్‌కి, చరణ్‌కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా హిట్ తర్వాత ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు మళ్లీ ఎప్పుడు విడుదలవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మెగా పవర్‌స్టార్ చెర్రీ జోష్ తగ్గకుండా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అయితే తారక్ మాత్రం ఇప్పటివరకు ఏ చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొనలేదు. దీంతో అభిమానులు కొంత డిసప్పాయింట్‌కు గురవుతున్నారు. వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే 'ఆచార్య' మూవీ ఆశించినరీతిలో హిట్ కాకపోవడంతో.. కొరటాల శివ ఎన్టీఆర్‌తో తెరక్కెంచే మూవీ స్క్రిప్టుని మరోసారి జాగ్రత్తగా పరిశీలించి సెట్స్‌పై తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఈ చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం కానుందని వార్తలొస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 31 చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ విశ్వనటుడు కమల్‌హాసన్‌ను ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే ఈ పాత్ర కోసం ప్రశాంత్‌నీల్ కమల్‌హాసన్‌ను సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించడానికి కమల్ ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. తారక్- కమల్ తెరపై కనిపిస్తే.. ఆ ఫీల్ మాటల్లో చెప్పడం ఎవరివల్లా కాదు. ఈ వార్తలు నిజమైతే.. తారక్- కమల్ కాంబినేషన్ కన్‌ఫర్మ్ అయితే అంచనాలు తారాస్థాయిలోనే నెలకొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.