
ప్రజాశక్తి-అనకాపల్లి
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవానికీ సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ పరిధిలో 5,282 మంది లబ్ధిదారులకు స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో మంగళవారం మంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా, ఆర్డిఓ చిన్ని కృష్ణ, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, తహశీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో సత్య శ్రీనివాస్, కార్పొరేటర్లు మందపాటి సునీత, కొణతాల నీలిమ, జాజుల ప్రసన్న లక్ష్మి, ఏఎంసి చైర్పర్సన్ పలక యశోద, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కసింకోట జడ్పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, పలక రవి, మళ్ల బుల్లి బాబు, జాజుల రమేష్, పెతకంశెట్టి జగన్మోహన్, పీలా రాంబాబు పాల్గొన్నారు.