
ప్రజాశక్తి-నగరం: స్థానిక వెలగపూడి రామకృష్ణ కళాశాలలో గత వారం నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల ప్రతిభా పరీక్షల ఫలితాలను సోమవారం కళాశాల కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి విడుదల చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ అధ్యక్షత వహించారు. మొదటి బహుమతి అల్ కమర్ ఉన్నత పాఠాశాల నిజాంపట్నం విద్యార్థి శశివర్ధన్‌కు రూ.5,000 ప్రథమ బహుమతి, భాష్యం స్కూల్ రేపల్లె విద్యార్దిని సాత్విక రూ.3,000 ద్వితీయ బహుమతి, వివేకనంద విద్యా విహార్ రేపల్లె విద్యార్దిని ధాత్రిప్రియలకు రూ.2,000 తృతీయ బహుమతులను విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమాదేవి చేతుల మీదుగా అందజేశారు. 50 మందికి రూ.500 చొప్పున అందజేశారు. ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించటం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలు, పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలో అలవరచుకోవచ్చని ఆమె అన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కళాశాలలో ఉచిత విద్యను అందించనున్నట్టు కరస్పాండెంట్ బుచ్యయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ డాక్టర్ కే సురేష్‌బాబు, పి నాగరాజు, వైపి కామేష్, సిహెచ్ నాగరాజు, సూపరింటెండెంట్ బి ప్రకాష్ బాబు, తెలుగు శాఖాధిపతి డాక్టర్ జిగురుపాటి మస్తాన్‌రావు, కే లక్ష్మీ బాలాజీ పరిపాలనాధికారి మాగంటి సుధాకర్ రావు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. మరియు 23 మంది విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.