Nov 30,2022 22:58

 మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌
ప్రజాశక్తి-అవనిగడ్డ

పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని, అంతకంటే అవివేకం మరొకటి ఉండదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలన్నీ కాక తాళియముగా జరిగిన ఉద్యమాలన్నీ పోలీసుల సహకారంతో అణిచివేసి తామేదో విజయం సాధించినట్లుగా ప్రభుత్వం విర్రవీగుతోందని విమర్శించారు. పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని, ఇప్పటికే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళిత మహిళా సర్పంచ్‌ పైనపాముల కృష్ణకుమారి పట్ల ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణంగా రాల్చిన ప్రతి కన్నీటి బొట్టు వైసిపి పతనానికి ఓ మెట్టు అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తోలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి కొల్లూరి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత, అవనిగడ్డ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బండి నాగవెంకట కనకదుర,్గ చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు