Apr 08,2021 23:32

ఉమేష్‌ను సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ గోరంట్ల

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
ఇటీవల టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన ఆచంట ఉమేష్‌కుమార్‌ను రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం అభినందించారు. ఉమేష్‌ కుమార్‌ తన తండ్రి ఆచంట బాలాజీతో కలిసి ఎంఎల్‌ఎ బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఉమేష్‌కుమార్‌ను శాలువా కప్పి సత్కరించారు. మరిన్ని చారిత్రక విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.