Jul 29,2021 23:23

ప్రజాశక్తి-పంగులూరు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు కిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ సిఇఒ డి.డేవానంద రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొక్కల సంరక్షణ, పర్యవేక్షణ, నీరుపోసి పెంచినందుకు రెండేళ్ల వరకు బిల్లులు చెల్లిస్తామని ఎపిడి సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రామాంజనేయులు, ఇఒఆర్‌డి రాజ్యలక్ష్మి, ఎపిఒ లక్ష్మీదేవి పాల్గొన్నారు.