Nov 20,2020 20:23

ముంబయి : పసిడి తనఖా సంస్థలు మణప్పురమ్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కొరడా ఝులిపించింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్‌ ఫైనాన్స్‌, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ.10 లక్షలు, రూ.5 లక్షలు చొప్పున ఆర్‌బిఐ జరిమానా విధించింది. బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్‌ కార్డు తీసుకోవడమనే నిబంధనలను అనుసరించకపోవడంతో జరిమాన వేసినట్లు ఆర్‌బిఐ తెలిపింది.