Jul 29,2021 19:40

MATLADUTUNNA DSP

పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు : డిఎస్‌పి
ప్రజాశక్తి-కలక్టరేట్‌
జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు బందరు ట్రాఫిక్‌ డిఎస్‌పి ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌ అధ్యక్షతన స్థానిక ఆర్‌ అండ్‌ అతిథి గహంలో రోడ్లపై సంచరిస్తున్న పశువులతో ప్రయాణీకులు, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పశువుల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాసూం బాషా మాట్లాడుతూ నగరంలో పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదలడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. వీటి నియంత్రణకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. పట్టణంలో పశువులన్నింటికీ పశుసంవర్ధక శాఖ ద్వారా టాగింగ్‌ వేయించి తద్వారా యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో యజమాని లేని పశువులను గుర్తించి 10 రోజుల్లోగా వాటిని దూర ప్రాంతాలకు తరలిస్తామన్నారు. 15 రోజుల్లోగా యజమానులు గల పశువులను గుర్తించి వారికి జరిమానా విధిస్తామన్నారు. అనంతరం వాటిని కూడా గో సంరక్షణ కేంద్రాలకు గాని అటవీ ప్రాంతాలకు గాని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం మైక్‌ అనౌన్మెంట్‌ ద్వారా పట్టణంలో అన్ని ప్రాంతాల ప్రజలకు పశువుల సంచారం వల్ల కలిగే ఇబ్బందులు గురించి తెలియపరుస్తామన్నారు. త్వరలోనే వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ డిఎస్‌పి భరత్‌ మాతాజీ, మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకష్ణ, పశుసంవర్ధక, రోడ్లు, భవనాలుశాఖ అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.