బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అమరావతిలో పేదలకు పట్టాల పంపిణీని అడ్డుకోవడం సిగ్గుచేటని వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం టిడిపి దుర్మార్గాన్ని నిరసిస్తూ స్థానిక వైసిపి కార్యాలయం నుంచి షరాఫ్ బజార్, శ్రీనివాస్ టాకీస్, వైఎస్‌ఆర్ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు అమరావతిలో ఇచ్చిన భూములను శ్మశానాలతో పోల్చడం చంద్రబాబుకు సబబు కాదన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.