
కలెక్టర్ పి.ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
బివి.రాజు మున్సిపల్ పార్క్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. నూతన జిల్లాగా ఏర్పడిన భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కుకు వచ్చే వారికి కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఎక్కడా శానిటేషన్ లోటు లేకుండా చూడాలన్నారు. విద్యుద్దీకరణ చేసి పార్క్‌ను సుందరీకరణ చేసి ప్రజలను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. బివి.రాజు కళాశాల యాజమాన్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూ.కోటీ 35 లక్షలతో బివి.రాజు పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కును ఐదు సంవత్సరాలపాటు సిఎస్‌ఆర్ నిధులతో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట పురపాలక సంఘం కమిషనర్ ఎస్.శివరామకృష్ణ, విష్ణు కాలేజీ డైరెక్టర్ జె.ప్రసాదరాజు, విష్ణు ఉమెన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.