Feb 07,2023 00:25
9వ వార్డులో పర్యటిస్తున్న ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు అన్నారు. సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకొని జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం వార్డులో సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌ బాబు, మునిసిపల్‌ కమిషనర్‌ ఐసయ్య, 9వ వార్డు కౌన్సిలర్‌ మల్లెల లలిత, మల్లెల రాజశేఖర్‌, వార్డు నాయ గొర్రెముచ్చు సోనీ, డేటా విజరు, డేటా రవి, డేటా జోసఫ్‌, గొర్రెముచ్చు విజరు, జోతుల అశోక్‌, కాగితాల ఉదరు, మల్లెల రత్న రాజు, కౌన్సిలర్లు స్వాతి, చుక్కా నాగలక్ష్మి, మించాలా సాంబశివరావు, కలవకూరి యానదిరావు, చీమకుర్తి బలకృష్ణ, కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్‌, కంపా అరుణ్‌, ఎబినేజర్‌, తోకల అనిల్‌, కోలా శివ, మహిమూద్‌, సల్లూరి అనిల్‌, కట్ట చంద్ర, మల్లీ రామకృష్ణ, కాగితాల ప్రకాష్‌, డొక్కా ప్రవీణ్‌, వాసిమల్ల బ్రదర్స్‌, యాతం క్రాంతి, యాతం మేరీ బాబు, గోలి గంగాధర్‌, జంగా ప్రేమ్‌ కుమార్‌, తేళ్ల రాంబాబు, షేక్‌ మస్తాన్‌, గడ్డం శ్రీను, చావలి వాసు, కట్ట గంగయ్య, జమ్మి ప్రసాద్‌ రెడ్డి, పులి హరికృష్ణ, పసుపులేటి కోటయ్య, కత్తుల దుర్గారావు, పలువురు పాల్గొన్నారు.