
ప్రజాశక్తి - నగరం
మండలంలోని పూడివాడలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బాపట్ల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆధ్వర్యంలో నాచురల్ ఫామింగ్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న అద్యక్షతన మాస్టర్ ట్రైనర్ ప్రసాద్ సలహా సూచనలు చేశారు. పూడివాడ రైతు భరోసా కేంద్రం విలేజ్ అసిస్టెంట్ శివశంకర్ సహకారంతో పూడివాడ గ్రామంలో ప్రకృతి వ్యవాసయంపై అవగాహన కల్పించారు. గ్రామానికి చెందిన గుగ్గిలం వెంకట సుబ్బారావు 5ఎకరాలలో గత 38వారాల నుండి పక్రృతి వ్వవసాయంపై పొలం బడి నిర్వహించారు. మొత్తం 52పొలం బడి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికీ 38పొలం బడులు నిర్వహించారు. ఇంకా 14పొలం బడి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి సోమవారం పొలం బడి నిర్వహించి రైతులకు మిత్ర, శత్రు పురుగుల అవగాహన కల్పిస్తున్నారు. శత్రు పురుగుల నివారణకు కషాయాలు తయారు చేసే విధానం నేర్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రైతులు పక్రృతి వ్వవసాయంపై మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. పొలం బడులలో చుండూరు, అమర్తలూరు, చెరుకుపల్లి, బ్రట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు యునిట్ల నుండి ఇన్చార్జులు, ప్రాజెక్టు రిసొర్స్ పర్సన్స్, పూడివాడ యునిట్ ఇన్చార్జ్, నీడ్ ఫార్మర్స్, రైతులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.