Aug 18,2022 20:53

పులిదాడిలో మరణించిన ఆవు

ప్రజాశక్తి- మెంటాడ : పెద్దపులి దాడిలో ఆవు మృత్యువాత పడింది. గజపతినగరం, మెంటాడ సరిహద్దు గిరిజన గ్రామాలైన సిడగంవలస, రాయివలస గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పులి దాడి చేయడం గమనార్హం. ఇప్పటివరకూ జిల్లాలో రాత్రివేళల్లో పులి సంచిరించి, మూగజీవాలపై దాడి చేసింది. ఇప్పుడు పట్టపగలే దాడి చేయడంతో గిరిజన వాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖా ధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మర్రివలస పంచా యతీ సర్పంచ్‌ చల్ల అర్జున్‌ డిమాండ్‌ చేశారు. పశువులపై పులి దాడి చేసిన ఘటనలు తరుచుగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.