Jul 29,2021 23:08

 మాట్లాడుతున్న అధికారులు

రేంజ్‌ అధికారి శ్రీపతి నాయుడు
ప్రజాశక్తి - రుద్రవరం:
 అడవుల్లో సంచరించే పులుల మనుగడతోనే వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని రుద్రవరం రేంజ్‌ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. గురువారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రుద్రవరం అటవీ రేంజ్‌లోని మిట్టపల్లె గ్రామంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్‌ సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేంజ్‌ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం అడవుల్లో పులుల సంతతి పెరుగుతోందని, నల్లమల అటవీ సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు వన్యప్రాణులను వేటాడకుండా వాటిని కాపాడు కోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల పులులు ఉన్నట్లు తెలిపారు. డిఆర్‌ఒ నాగేంద్ర నాయక్‌, ఫారెస్ట్‌ అధికారులు వెంకటసుబ్బయ్య, నాగరాజు, రాణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. వెలుగోడు : వెలుగోడు రేంజ్‌లో అటవీ అధికారులు, ప్రొటెక్షన్‌ వాచర్స్‌, పర్యావరణ ప్రేమికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చడం జరిగింది. ముఖ్యఅతిధిగా డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, అలెన్‌ చాంగ్‌ తెరాన్‌ హాజరై మాట్లాడారు. రేంజ్‌ ఆఫీసర్‌ దత్తాత్రేయ , ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ మహానంది, మగబుల్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ రవి కుమార్‌, బాలయ్య, యూనికే, సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు : బైర్లూటి గూడెంలో బైర్లూటి రేంజ్‌ ఆఫీసర్‌ శంకరయ్య అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బైర్లూటి సర్పంచి పి.గురువమ్మ, ఇడిసి వైస్‌- ప్రెసిడెంట్‌ ఆర్తి గురువయ్యచ, ఫారెస్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.