Sep 19,2023 22:54

ప్రజశక్తి - చీరాల
తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడని వైసిపి రాస్ట్ర కార్యదర్శి నీలం శ్యామ్యేల్‌ మోజెస్‌ అన్నారు. ఈ విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. స్థానిక సెయింట్ మార్క్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఆధారలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. బంధువైన బాబుపై మంకారంతో పురందేశ్వరి సమర్దిస్తున్నారని అన్నారు. ఒక నేరస్థుడికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు మద్దతుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. తప్పు చేశాడు కాబట్టి జైలుకు వెళ్లాడని పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి వాళ్లు వాస్తవాలు మాట్లాడకపోయినా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని కోరారు.