May 29,2023 20:56

ప్రజాశక్తి - కాళ్ల
విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. కాళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సుమారు 26 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకేచోట చేరి ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సంతోషంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ తోటి విద్యార్థులకు ఉపయోగపడతామంటూ తీర్మానాలు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కన పెట్టి వినోద కార్యక్రమాల్లో పాల్గొని గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ కలయికకు కృషి చేసిన కోరుకొండ నాగేశ్వరరావు, పోతినీడి శ్రీనివాసు, కొనిశెట్టి సురేష్‌, చిత్తజల్లు గిరిబాబు, బావిశెట్టి కళ్యాణ్‌ చక్రవర్తి, కుమారి, వనిత తదితరులను తోటి విద్యార్థులు అభినందించారు.