
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి మండల వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన గురువారం రాత్రి కురిసింది. రాత్రి 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ వర్షం కురిసింది. వర్షం రావడంతో రాత్రంతా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు పలుచోట్ల వక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై వృక్షాలు పడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పుట్టపర్తి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈదురు గాలులకు పలుచోట్ల మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో వక్షాలు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయా పంచాయతీ సర్పంచులు, ప్రజలు పడిపోయిన వక్షాలను తొలగించడానికి కషి చేశారు. కప్పలబండలో గురువారం రాత్రి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దగ్గరుండి పడిపోయిన వక్షాలను తొలగింపచేశారు.