Jun 10,2021 18:38

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ - రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఏకే తెలుగు రీమేక్‌లో సినిమాలో దర్శకుడు వి.వి వినాయక్‌ కనిపించబోతున్నాడు. ఒరిజినల్‌ సినిమాలో దర్శకుడు కనిపించాడు. కానీ తెలుగు సినిమాలో ఆ పాత్రలో వినాయక్‌ నటించబోతున్నాడు. ఆయన గతంలో 'ఠాగూర్‌', 'నేనింతే', 'ఖైదీ నెం. 150' చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్‌ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది.