Aug 05,2022 20:36

న్యూఢిల్లీ :  ప్రముఖ నగదు చెల్లింపుల వేదిక పేటియం సేవల్లో అంతరాయం చోటు చేసుకుంది. శుక్రవారం యాప్‌లో లాగిన్‌ సమస్యలు ఉత్పన్నమయ్యాయి.  దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులో ఎదురయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల్లోని సమస్యలను వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా ఏకరువు పెట్టారు.