
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ద్వారక క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాతో విరాట్ కర్ణ అనే మరో కొత్త హీరోని ఇండిస్టీకి పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు 'పెద కాపు' అనే టైటిల్.. 'ఓ సామాన్యుడి సంతకం' అనే ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అందుకే టైటిల్‌లో 'పెదకాపు 1' పెట్టారు. ఫస్ట్ టైం ఈ సినిమాతో ఊరమాస్ టచ్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ఓ వర్గానికి చెందినదిగా ఉండడంతో సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. మరి ఈ ప్రాజెక్టుతో ఎలా ముందుకు వెళ్లబోతున్నారో చూడాలి.