Oct 15,2020 22:39
ఫేస్ బుక్ మెసెంజర్ కు కొత్తరూపం

ఫేస్‌బుక్ మెసెంజర్  లోగో ఇప్పుడు కొత్త రంగులతో కొత్తరూపాన్ని సంతరించుకుంది.  ఇది ఫేస్ బుక్-  ఇన్‌స్టాగ్రామ్ కలయికగా కనిపిస్తుంది. దీని కొత్త డిజైన్ క్రాస్-యాప్ కమ్యూనికేషన్ కోసం మెసెంజర్-ఇన్‌స్టాగ్రామ్ విలీనంలో భాగంగా ఈ మార్పులను చేశారు. కొత్త డిజైన్ తో పాటు మెసెంజర్ లో చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు, వానిష్ మోడ్‌లో  కూడా మార్పులు చేశారు.  మెసెంజర్ పాత లోగో లోని నీలం రంగుతో పాటు  పింక్ కలర్ మిశ్రమంతో దీన్ని డిజైన్ చేశారు.  ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇన్‌స్టాగ్రామ్  లోగోకు దగ్గరగా వుంటుంది. 

కొత్త మెసెంజర్ ఫీచర్స్ :
 కొత్త లోగోతో పాటు మెసెంజర్ లవ్, టై-డై వంటి కొత్త చాట్ థీమ్‌లను కూడా మెసెంజర్ లో జోడించారు. ఫేస్‌బుక్ కూడా మెసెంజర్‌కు కస్టమ్ రియాక్షన్స్, సెల్ఫీ స్టిక్కర్లు, వానిష్ మోడ్‌ వంటి ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విలీనంలో భాగంగా ఈ కొత్త ఫీచర్లు మెసెంజర్‌కు జత చేశారు. అంతేగాకుండా మెసెంజర్- ఇన్‌స్టాగ్రామ్ రెండూ విలీనం అయినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వానిష్ మోడ్, కస్టమ్ రియాక్షన్ తో సహా 10 కొత్త మెసేజ్ ఫీచర్ లను జోడించారు.  అలాగే, ఇన్‌స్టాగ్రామ్ ‘వాచ్ టుగెదర్', చాట్ కలర్స్, ఫార్వార్డింగ్, రిప్లైస్, యానిమేటెడ్ మెసేజ్ ఎఫెక్ట్స్ వంటి మెసెంజర్ ఫీచర్లను కూడా ఇకపై అందిస్తుంది. అదే సందర్భంలో ఫేస్‌బుక్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు కొత్త అప్ డేట్ ను కూడా విడుదల చేయనుంది. ఇది త్వరలో ఉత్తర అమెరికా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అయితే, భారత్ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు.