Nov 29,2021 22:22

యాజమాన్యంతో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేటు పుణ్యగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజులు చెల్లించా లంటూ కళాశాల యాజమాన్యం విద్యా ర్థులపై ఒత్తిడి తేవడంతో సోమవారం విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయ కుడు రిషి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యాలు విద్యా సంవత్సరం మొదట్లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా తల్లి అకౌంట్‌లో జమయ్యే నగదును కళాశాలలో చెల్లించాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పథకాన్ని సకాలంలో అమలు పరచని కారణంగా విద్యార్థులు కళాశాలకు ఫీజులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు. దీంతో యాజమాన్యాలు విద్యార్థుల ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారన్నారు. జగనన్న విద్యా దీవెన జమ చేసినప్పుడే కళాశాలకు విద్యార్థులు ఫీజులు చెల్లిస్తారని అప్పటి వరకూ పరీక్షల ఫీజు మాత్రమే చెల్లిస్తారని కళాశాల యాజమాన్యంతో మాట్లాడామని యాజమాన్యం కూడా అంగీకరించిందని ఈ మేరకు ఆందోళన విరమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు.