May 12,2022 20:49

ప్రైవేట్‌ రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ వివిధ కాలపరిమితులు గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. యాక్సిస్‌ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం, కొత్త రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంక్‌ సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్‌ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ ఆఫర్‌ చేస్తుంది. ఇది అన్ని కాలపరిమితులకు వర్తిస్తుంది. అత్యధికంగా 5 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీపై 5.75 శాతం వడ్డీని అందిస్తుంది.